ఏ వేడుకల్లో అయినా సంప్రదాయ,పాశ్చత్య దుస్తుల్లో అయినా మేడ నిండా పరుచుకోన్న మెరుపు లీనే కుందన్ నగలు చక్కగా ఉంటాయి. కుందన్ ,ముత్యాలు,పూసల వరుసలు గ్రాండ్ లుక్ ఇస్తాయి. కానీ ఇంత అందమైన కుందన్ నగలు వాడుకోవటంలో శ్రద్ద తీసుకోకపోతే వన్నె తగ్గిపోతాయి. మేకప్ వస్త్రధారణ అయ్యాక ఈనగలు ధరించాలి. మేకప్ రసాయనాలు నగల మెరుపును తగ్గిస్తాయి.శ్రద్దగా ధరించాలి. పొరపాట్నా చేజారి క్రిందపడితే కుందన్ లో పుగుళ్ళు వస్తాయి. వీటిని మెత్తని వస్త్రంలో తుడిచి వాటికి కేటాయించిన బాక్స్ లోనే భద్రపరచాలి.ఇంట్లో ఎప్పుడు పాలిష్ చేయకూడదు. నాపుణుల వద్ద పాలీష్ చేయిస్తే మంచిది.

Leave a comment