నృత్యం ఏకాగ్రతను పెంచుతుంది.తెలివి తేటలు పెరగాలంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలనుకొంటే కాసేపు డ్యాన్స్ చేయండి అంటున్నారు బ్రిటన్‌లోని కొవెంట్రీ యూనివర్సిటీ శాస్త్రవేత్త మైకేల్‌ డంకన్‌. ఆయన తన పరిశోధనల్లో డ్యాన్స్‌ చేస్తే మెదడు చురుకుగా మారి, తెలివితేటలు పెరుగుతాయని తేల్చారు. కొందరు విద్యార్థుల పై చేసిన ఈ పరిశోధనల్లో వారానికి ఒక డ్యాన్స్‌ క్లాస్‌కు హాజరైన వారిలో విషయాలను ఆకళింపు చేసుకునే శక్తి 8 శాతం, ఏకాగ్రత 13 శాతం,
జ్ఞాపకశక్తి 18 శాతం పెరిగినట్లు కనుగొన్నారు. ఎలాంటి నాట్యమైనా పర్లేదు కాసేపు సంగీతం,డ్యాన్స్ తో మొదడు చురుగ్గా అవుతుందని చెబుతున్నాయి అధ్యయానాలు.

Leave a comment