పిల్లలు హుషారుగా తయారు కావాలన్నా ,హైపర్ యాక్టివ్ పిల్లలు నాజూకుగా ఉండాలన్న రంగుల తోనే సాధ్యం అంటారు నిపుణులు . పిల్లలు బెడ్ రూమ్ లకు ఉపయోగించే రంగులు వాళ్ళ మనసు పైన ప్రభావం చూపెడుతుంది అంటున్నారు . ఎరుపు రంగు హుషారు ను రెట్టింపు చేస్తుంది అరేంజ్ ఆత్మవిశ్వాసం పెంచుతుంది . ఆకుపచ్చ ఏకాగ్రత పెంచుతుంది . పసుపు స్థిరత్వాన్ని ఇస్తుంది . నీలం పిల్లల మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది . పర్పుల్ సృజనని పెంచుతుంది . గులాబీ విపరీత ధోరణులను అదుపు చేస్తుంది . కూల్ కలర్స్ ప్రశాంతత ఇస్తాయి రూమ్ కలర్స్ హాయిని సంతోషాన్ని ఇస్తాయి పిల్లల మానసిక స్థితిని అద్భుతంగా మార్చేస్తాయి ఈ రంగులు .

Leave a comment