“అమ్మవు నీవే అఖిల జగాలకు….
     అమ్మలగన్నా అమ్మవు నీవే….నీ చరణములే నమ్మితిమమ్మా..శరణము కోరితినమ్మా….పెద్దమ్మా…జననీ..శివకామినీ”!

ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ..హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అతి పురాతన చరిత్ర గల పెద్దమ్మ తల్లి దేవాలయం.ఆషాఢమాసంలో తప్పక దర్శించవలసిన ఆలయం.మనసులోని భావాన్ని అర్థం చేసుకుని కోరికలు తీర్చే పెద్దమ్మ తల్లి.
పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడి కిరాతక చర్యలకు త్రిమూర్తులు అమ్మ వారిని సంహరించమని వేడుకున్నారు.జగత్జనని అలసి సేదతీరుదామని ఈ దట్టమైన అడవి ప్రాంతంలో మనకు పెద్దమ్మ తల్లిగా పూజలు అందుకుంటోంది.
పెద్దమ్మ తల్లికి ఐదు ఉత్సవాలు ఆర్భాటంగా జరుగుతాయి.బ్రహ్మోత్సవాలు,బోనాలు,శాకాంబరి,దసరా,శరన్నవరాత్రులు.నూతన వాహనానికి, కొత్త సినిమాకి పూజించిన విజయం సాధిస్తామని భక్తుల విశ్వాసం. 11 ఆదివారాలు క్రమం తప్పకుండా ప్రదక్షిణం చేసిన సంతానం కలుగుతుంది.
ఇష్టమైన రంగులు:ఆకుపచ్చ, ఎరుపు, పసుపు
ఇష్టమైన పూలు: అన్ని రంగుల పూలు సమర్పించిన ఆనందం
ఇష్టమైన పూజలు: చీర,రవిక,పచ్చని గాజులు,పసుపు కుంకుమ,పూల దండ సమర్పించాలి.
ముడుపులు: ఆకుపచ్చని రవికలో కొబ్బరికాయను పెట్టి ముడుపు గట్టిన తప్పకుండా అమ్మ దయ కలుగుతుంది.
నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు, చద్ది.
పాహిమాం…పాహిమాం.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment