ఇవాల్టి తరం అమ్మాయిలకు పెద్దగా ఆర్ధిక ప్రణాళికలు వేసుకోవడం రానట్లేనని, ఉద్యోగినులు ఇప్పటికీ పి.పి.ఎఫ్, ఫిక్సడ్ డిపాజిట్ల బంగారం వంటి సంప్రదాయ పద్ధతులకే ప్రాధాన్యత ఇస్తారని ఒక సర్వే చెపుతుంది. ఎక్కువ రాబడి ఇచ్చే మ్యుచువల్ ఫండ్స్, ఇతర మదుపు పధకాలు ఎన్నో వున్నాయి. పొడుపు, మదుపు రెండు ఉద్యోగ ప్రారంభంలో మొదట పెట్టాలి. పాతికేళ్ళ వయస్సులో నెలనెలా మూడు వేళ రూపాయిలు కడితే పదవీ విరమణ వయస్సు వచ్చేసరికి మూడు కోట్ల రూపాయిల పెన్షన్ ఇచ్చే పడకాలున్నాయి. నలబై ఏళ్ళ మహిళ ఈ ప్లాన్ కోసం ప్రయత్నం చేయాలంటే కనీసం నెలకు 40 వేలు దాచి పెట్టాలి. అందుకే సరైన సమయంలోపు ప్రారంభించాలి. ప్రతి ఉద్యోగానికి కనీసం ఆరు నెలల జీతం ఎంత వుంటుందో అంత డబ్బు సేవ చేసి పెట్టుకుని తర్వాతే పొడుపు గురించిఆలోచించాలి. ఏదయినా ప్రమాదం జరిగినా ఉద్యోగం పోయినా, కొత్త జాబ్ వెతుక్కునేదాకా ఆ డబ్బు కాపాడుతుంది.
Categories
WhatsApp

సేవింగ్స్ మొదలు పెట్టారా లేదా?

Leave a comment