స్త్రీలు వంటరిగా ఉండగలరు.అసలు ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడుతున్నారు అని తాజా గణాంకాలు చెబుతున్నాయి.శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టం 2018 గణాంక నివేదిక ప్రకారం దేశంలో 5.5 శాతం మంది స్త్రీలు  వివాహం అయ్యాక అనేక కారణాల రీత్యా ఒంటరిగా ఉంటున్నారు. విడాకులతో విడిపోయి, భర్త చనిపోయిన కారణాలు ఏవైనా ఒంటరిగానే ఉన్నారు.తమిళనాడులో ఆ సంఖ్య రెట్టింపు గా ఉంది కేరళలో ఒంటరిగా ఉన్న స్త్రీలు 9.3 శాతం గా ఉంటే తమిళనాడులో 9.1 శాతం ఉంది.ఆంధ్రప్రదేశ్ లో 7.8 శాతం తెలంగాణ లో 7.1 శాతం ఉన్నారు ఎన్నో కారణాల వల్ల ఒంటరిగా ఉన్న పురుషుల శాతం 1.5 మాత్రమే. మగవారు ఎలాగోలా తోడు వెతుక్కుంటే స్త్రీలు ఆ తోడు వద్దు అనుకుంటున్నారు. చదువు సంక్షేమ పథకాలు ఉపాధి మార్గాలు ఇవన్నీ ఒంటరి స్త్రీలకు తోడుగా తమ కాళ్ళపై తాము నిలబడేలా చేస్తున్నాయి.

Leave a comment