నీళ్ళు తాగంటం వల్ల ఆకలికి అడ్డుకట్ట వేయవచ్చు అంటున్నారు పరిశోధకులు. బాగా ఆకలి వేసినప్పుడు అదేపనిగా ఆహారం తీసుకోవటం కన్నా ఒకటి రెండు గ్లాసుల నీళ్ళు తాగమంటున్నారు. భోజనం చేసే సమయంలో కూడా నీళ్ళు ఎక్కువగా తాగితే త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు పెరగకుండ ఉండటం కోసం చేసే ప్రయత్నాల్లో ఇది ఒకటి. అలాగే బరువు పెరగకుండా వ్యాయమం చేయటం అంటే ఒకటి నడక, రెండోది సైక్లింగ్ ఈ మధ్య ఓ మంచి రీసెర్చ్ రిపోర్టు వచ్చింది. దక్షిణ డెన్మార్క్ కు చెందిన పరిశోధకులు ఈ సైక్లింగ్ చేసేవారిలో టైప్ టూ డైయాబెటిస్ వచ్చే లక్షణాలు తగ్గాయని చెపుతున్నారు. 40,50 సంవత్సరాల వయసు గల స్త్రీ,పురుషుల్లో ఈ పరిశోధన చేస్తే ఫలితాలు బావున్నాయి. ఒకటి సైక్లింగ్ వల్ల కీళ్ళ నొప్పులు తగ్గాయి. రెండోది డయాబెటిక్ భాదితుల్లో ఆరోగ్యం మెరుగుపడింది. బరువు ఉన్నవాళ్ళు నడిస్తే కీళ్ళ నొప్పులు పెరుగుతాయని సైక్లింగ్ కూడా చేయమంటారు. నడక కష్టం అనిపిస్తే సైక్లింగ్ వల్ల కూడా అదే ఫలితం ఉంటుందని చెపుతున్నారు, టినేజర్లకు కూడా ఈ రెండు టిప్స్ పనికొస్తాయి, మంచి నీళ్ళు బాగా తాగండి, సైక్లింగ్ కూడా చేయండి.
Categories