Categories
చలికాలంలో చర్మం పొడిబారి పోతూ ఉంటుంది . కొన్ని రకాల నూనెల్లో పోషకాలు చర్మాన్ని తాజాగా తేమగా కనబడేలా చేస్తాయి . బాదం నూనెలో ఇ -విటమిన్ ఉటుంది . రాత్రి పాడుకొనే ముందర ఈ నూనెతో మొహం చేతులు పాదాలు మద్దన చేస్తే చర్మం నిగారింపుతో ఉంటుంది లావెండర్ నూనె ను ఇతర నూనెల్లో కలిపి వాడినా ఇదే ప్రయోజం . ఈ నూనెతో జుట్టు రాలటం కూడా తగ్గిపోతుంది . అలాగే ఆముదం ,కొబ్బరినూనె కలిపి రాసుకున్నా చర్మానికి తేమ అందుతుంది . వంటకు వాడే సన్ ఫ్లవర్ ఆయిల్ కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది ఈ నూనెలు సహజ మాయిశ్చరైజర్లు లాగా చర్మాన్నీ మృదువుగా మార్చేస్తాయి .