నీకు బద్దకం ,ఎందుకు పనికి రావు అని సాధారణంగా అనేమాట. బద్దకం ఎవ్వళ్ళు ఇష్టపడరు.కానీ తాజా పరిశోధనలు బద్దకస్తులు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారంటున్నాయి .రోజులో ఎంతో భాగం ఏ పనీ చేయకుండా సోఫాలోనూ ,మంచంపైనో ,పడకుర్చీలోనూ నడుం వాల్చి సాయంత్రం ఊరికే అలా తిరిగొచ్చి టి.వి చూస్తూ కాలాక్షేపం చేసే వాళ్ళు హాయిగా దీర్ఘకాలం బతుకుతారట. 299రకాల జాతుల జీవక్రియ రేట్లను విశ్లేషించి మరీ ఈ విషయం ప్రకటించారు యూనిర్సిటీ ఆఫ్ కాన్సాస్ శాస్త్రవేత్తలు.శక్తిని ఎంత వాడుకొంటే అంత అయిపోతుంది దాచి పెట్టి ఉంచితే అలా నిలబడి ఉంటుంది. ఎక్కువ కష్టపడకుండా హాయిగా బద్దకంగా గడిపితే ఎక్కువ కాలం జీవిస్తారంటున్నాయి పరిశోధనలు.

Leave a comment