Categories
బ్యాంకాక్ లో 314 మీటర్ల ఎత్తైనా ఓ భవనం ఉంది. మొత్తం 78 అంతస్థులుగా నిర్మించిన ఈ భవనం టెర్రస్ అంతా గ్లాస్ తో నిర్మించారు. ఆ టెర్రస్ పైన నడవటం గొప్ప అనుభవం. అంత ఎత్తున వట్టి గ్లాస్ పైన కింద ఎత్తైన భవనాలు కనిపిస్తూ ఉండగా నడవటానికి కాస్త గుండె ధైర్యం కావాలి. అయితే ఇది పర్యాటకులను విపరితంగా ఆకర్షిస్తుంది. ఈ టెర్రస్ పైన ఫ్యాబ్రిక్ సూట్లు ధరించే నడవాలి. భవనం చివర గ్లాస్ డోర్ మరింత ప్రమాదకరంగా 360 డిగ్రీల కోణంలో ఎటుచూసిన వారి ప్రతి బింబం కనిపించేలా కట్టేరు. అక్కడికి వెళ్ళాలంటే కాస్త ధైర్యం కావాలి మరి. ఈ సారి టూర్ వెళ్ళాలంటే ఈ బ్యాంకాక్ లోని కింగ్ పవర్ మహానఖన్ గుర్తుంచుకోవచ్చు.