కాఫీలో వుండే కెఫెన్ కు సరైన జోడీ షుగర్ అని తేల్చారు స్పెయిన్ పరిశోధకులు. ఏది ఎలా చెప్పినా కాఫీ తాగడం మంచిదే నని చెప్పారు కనుక ఆ పరిశోధనలకు మనస్పూర్తిగా నమ్మచ్చు. కొంత మంది వట్టి డికాషన్ తాగుతారు. అదసలు మంచి అలవాటే కాదు. కెఫెన్, చక్కరలు ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తాయి గనుక ఆ రెండింటిణీ కలసి కట్టుగా చక్కగా మంచి కాఫీ గా చేసి తీసుకోండి అంటున్నారు. ఈ రెండు పదార్ధాలు మెదడులో ఒకటి జ్ఞాపక శక్తిని రెండవది దృష్టిని కేంద్రీకరించేందుకు మంచి ప్రభావం చూపెడతాయి. ఆ రెంటి పైన ప్రభావం చూపించే కమ్మని కాఫీ ని పాలు, పంచదార చక్కర తో కలిపి తాగండి అని చక్కగా చెప్పుతున్నారు. దాన్ని ఫాలో అవ్వాలి కదా?

Leave a comment