నీహారికా, చాలా మంది ఎందుకు ప్రతి దానికి సందేహిస్తూ, సంకోచ పడుతూ వుంటారు. మంచి వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం పెంచుకోవడం పెద్ద కష్టం కాదు. సందేహాలు, సంకోచాలు పక్కన పెట్టి ముందుగా సమకాలీన, తాజా ఆర్దిక, రాజకీయ శాస్త్ర  విషయాలు తెలుసుకునేందుకు టీవిలు, న్యుస్ లు పేపర్లు ఫాలో అవ్వుతూ అప్ డేట్ గా వుండాలి. చక్కని సమాచారం మన దగ్గర వుంటే బాగా మాట్లాడగలం. అలాగే చుట్టూ వున్న వాళ్ళు, స్నేహితులు, ఇరుగు పొరుగులు, కాలేజీ మేట్స్ ఎవరన్నా సరే వాళ్ళ తో సన్నీహితంగా, కలిసి మెలసి వుండాలి శరీరాన్ని కాస్త అదుపులో ఉంచుకుని అంటే మనం మాట్లాడుతుంటే మాటలు తడబడకుండా, కాళ్ళు వణికి పోకుండా, కష్ట ప్రాక్టీ స్ చేస్తే, హాయిగా ఎవరితో నైనా మాట్లాడవచ్చు. సబ్జెక్ట్వుంటుంది కనుక ఎవరు బోర్ గా ఉందని మొహం పెట్టరు. కొత్త కొత్త పనులు చేస్తూ కొత్తగా ఆలోచిస్తూ ఎవరికైనా నచ్చనివి ఆనందించే పనులు చేస్తూ వుంటే మనల్ని అందరు అభిమానిస్తారు. ఇక అప్పుడు సందేహాలు పోటాయి ఆత్మ విశ్వాసం వస్తుంది.

Leave a comment