Categories
వర్షం వస్తే ఇంట్లో దోమలు ముసిరిపోతాయి. ఎన్నో అనారోగ్యాలు తీసుకొచ్చే దోమల్ని ఇంట్లోంచి తరిమేసేందుకు ఈ చిట్కాలు పనికి వస్తాయి. వెల్లుల్లి రెబ్బలు,లవంగాలు పొడి చేసి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఇంట్లో నలుమూలలా చల్లితే ఆ వాసనకు దోమలు రావు. నాలుగైదు చిన్న కుండీల్లో పుదీనా మొక్కలు పెంచిన చుట్టు పక్కల దోమలు జీవించలేవు. తులసి రసం,కాఫీ గింజలు ఉడక బెట్టిన నీళ్లు ఇంట్లో మూలల్లో చల్లిన దోమలు రావు.