Categories
ఒక్కో వయసులో ఒక్కో విధానమైన వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలంటారు ఎక్స్ పర్ట్స్.ఇరవై ఏళ్ళ వయసులో వారంలో 40నిమిషాల చోప్పున మూడు రోజులు గుండెకు సంబంధింయిన వ్యాయామాలు చేయాలి. బరువు లెత్తే వ్యాయామాలతో కండరాలు ధృఢంగా మారతాయి. 35ఏళ్ళు వచ్చాక వారంలో రెండు రోజులు ఇరవై నుంచి ఐదు నిమిషాలు వేగంగా నడవటం వంటివి చేయాలి. భుజాలు బలంగా ఉండే వ్యాయామాలు అవసరం .ఇక నలభై ఏళ్ళకు గుండెకు సంబంధించి వ్యాయామం చేయాలి కానీ మరీ మితిమీరి ఉండకూడదు. నడకకు ప్రాధాన్యత ఇస్తే మోకాళ్ళ నొప్పులు,వెన్నెముక సమస్యలు,నడుము నొప్పి రాకుండా ఉంటాయి.