Categories
వంట తొందరగా అయ్యేందుకు కొన్ని చిట్కాలు పాటించవచ్చు కూరలు వండేందుకు వెడల్పాటి పాన్ బదులు చిన్న పాన్ తీసుకోవాలి.చిన్న పాన్ మంట బాగా తగిలి వంట తక్కువ సమయంలో పూర్తవుతోంది.కూరగాయలు చిన్న ముక్కలుగా కోస్తే అవి తొందరగా ఉడుకుతాయి.ఫ్రిజ్ లో ఉంచిన కూరగాయలు పన్నీర్ వంటివి వంట కు ముందే తీసి బయట పెట్టాలి. వండే సమయానికి వాటి చల్లదనం తగ్గుతుంది.వంట కు ముందే ఓవెన్ ఆన్ చేసి టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. అపుడు ఓవెన్ లో బేకింగ్ లేదా రోస్టింగ్ చేయాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉంచుకోవాలి. దీనితో తక్కువ సమయంలోనే బేకింగ్ రోస్టింగ్ పూర్తివుతుంది గ్రేవీ కూర వండేటప్పుడు ముందే వేడి చేసి పెట్టుకొన్న నీళ్లు పోస్తే కూర తొందరగా అవుతోంది.