Categories
యాపిల్ పండుతో వేసే ప్యాక్ ముఖంపై ముడతలు కళ్ళ చుట్టూ ఏర్పడే నల్లని వలయాలు తగ్గిస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. యాపిల్ గుజ్జు, నిమ్మరసం పెరుగు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి మెడకు పట్టించాలి. పావుగంట తర్వాత చల్లని నీళ్ళతో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మంపై పేరుకొన్న మురికి మృతకణాలు తొలగిపోతాయి. తరచుగా ఈ ప్యాక్ వేసుకుంటే ముడతలు తగ్గిపోతాయి అలాగే యాపిల్ గుజ్జు పెరుగు నిమ్మరసం కలిపిన ప్యాక్ కూడా మంచి ఫలితం ఇస్తుంది. చర్మం శుభ్రపడి కాంతులీను తుంది.