నేత్రీ ఫౌండేషన్ ద్వారా భూపాల్ కు చెందిన Kanksshi Agarwal మహిళలకు రాజకీయ పాఠాలు బోధిస్తోంది. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో అర్బన్ పాలసీ అండ్ గవర్నెన్స్ చదివిన కనక్షి పాలనలో ఎక్కువగా పురుషులే ఉండటం, స్త్రీలకు సమానత్వం లేకపోవటం గమనించింది దేశవ్యాప్తంగా 2017 నుంచి జిఎస్టి అమల్లోకి వచ్చాక,పెరిగిన పన్నుల్లో, మహిళలు వాడే శానిటరీ నాప్ కిన్స్ పైన 18 శాతం పన్ను భారం పడ్డాక జిఎస్టి కౌన్సిల్ లో మహిళలు లేకపోవటం వల్లే ఇలా జరిగిందని అర్థం చేసుకున్న. దేశ రాజకీయాల్లో మహిళల సంఖ్య పెరిగితేనే స్త్రీల సమస్యలకు అసలైన పరిష్కారాలు దొరుకుతాయి అనిపించింది. అందుకే నేత్రీ ఫౌండేషన్ ద్వారా స్త్రీలకు శిక్షణ ఇవ్వటం మొదలు పెట్టాను అంటుంది కన్కక్షి అగర్వాల్.

Leave a comment