లోక్ సభ ఎంపీ నుస్రత్ జహాన్ రుహి సినిమా ఇండస్ట్రీ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు.బసిర్హాట్ నియోజకవర్గం నుంచి గెలిచారు ఈ మధ్యకాలంలో ఫ్యాన్సీ యు అనే వీడియో చాట్ యాప్ నమ్రత ఫోటోని వాడి లాక్ డౌన్ సమయంలో ఇంట్లో కూర్చుని కొంత ‘ఫ్రెండ్స్ తో కనెక్ట్ అవండి’ అంటూ క్యాప్షన్ పెట్టింది.తన అనుమతి లేకుండా ఫోటోను వాడినందుకు కోల్ కతా పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. నుస్రత్ సైబర్ క్రైమ్ సెల్ కు కూడా కంప్లైంట్ చేశారు.నే నీ ఫిర్యాదును కేవలం కోపంతో చేయలేదు చిన్న అభ్యంతరాన్ని అయినా చూసి చూడనట్లు వదిలేయకండి అంటూ ఆడపిల్లలకు మహిళలకు తెలిసేందుకు చేశాను.మనకు చెప్పకుండా మన విషయాల్లో చొరవ తీసుకోవద్దు అని కచ్చితంగా చెప్పేందుకే ఫిర్యాదు చేశాను అంటున్నారు నస్రత్.

Leave a comment