ఏదయినా ఒక పరిమితిలో ఉంటేనే బావుంటుంది. అతిగా వున్న దాన్ని వదిలేయమనే చెపుతారు పండింతులు. ఇదిగో ఈ అతి వల్ల మేలు కంటే కీడే అధికం అంటారు. కొందరు చురుగ్గా ఆరోగ్యంగా వుండేందుకువ్యాయామం మొదలుపెడతారు. చక్కని ఆకృతి కావాలనుకుంటారు. అది కాస్త మోతాదుమించితే చాలా నష్టం. బరువులెత్తే వ్యాయామం చేశాక కొంత విశ్రాంతి కావాలి. ఎందుకంటే వ్యాయామాలతో కండరాళ్ళ వత్తిడి కి ఎదుర్కొంటాయి. ఒక్క సారి లోలోపల చిన్న పాటి గాయాలు కూడా అవుతాయి. అవి తిరిగి కోలుకోవాలంటే విశ్రాంతి కావాలి. అలా విశ్రాంతి లేని వ్యాయామం తో కండరాల్లు బలపడటానికి బదులు బలహీనమైపోతాయి. సాధారణంగా వ్యాయామంతో జీవక్రియలు చురుకుగా మారి కేలరీలు కరుగుతాయి కానీ అతిగా చేసే వ్యాయామం తో జీవక్రియతో మందగించి బరువు పెరుగుతారు. మోతాదుకు మించిన వ్యాయామం చేస్తే హార్మోన్ల హెచ్చు తగ్గులు పెరిగి నెలసరులు ఆగిపోయే ప్రమాదం కూడా వుంది. అలాగే అవాంచిత రోమాలు వంటి అనర్ధాలు ఉంటాయి. ఈ అధికమైన వ్యాయామం, శరీర శ్రమ వల్ల అతి నిద్ర లేదా అస్సలు నిద్ర పట్టక పోవడం ఉంటాయి. అందుకే ఏదైనా మితంగా ఉంటేనే మేలు.

Leave a comment