Categories
పంచాదార ,తీపి పదార్థాలు తినడం మానేస్తే డయాబెటిస్ అదుపులో ఉంటుంది అనుకొంటారు కానీ అదోక్కటే సరికాదు కేవలం చక్కెర మాత్రమే కారణం కానేకాదు. బ్లడ్ షుగర్ స్థాయిల్ని క్రమంలో ఉంచటంలో శరీరంలో ఉత్పత్తి చేయగల ఇన్సులిన్ పని చేస్తుంది. శరీరంలో ఇన్సులిన్ తగ్గడం లేదా పూర్తిగా లేకుండా పోవటం వ్యాధికి కారణం. అలాగే జీవన శైలి కూడా కారణం . కాకపోతే తియ్యని పదార్ధాలు అతిగా తీసుకోవటం ,కొవ్వు పేరుకొని స్థూలకాయం రావడం వంటివి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. వాటివల్ల వచ్చే అనార్థాలు అనేకం అందుకే ఏదైనా మితంగా ఉండాలి.