పాడుకొనేటప్పుడు ఎడమ వైపు తిరిగి పడుకొంటారు అంటే నిద్ర వచ్చే వరకు అటు ఇటు మార్చు అనే సమాధానం దాదాపుగా వస్తుంది. కానీ ఎడమ వైపు తిరిగి పడుకుంటే రాత్రి సమయంలో గాఢమైన నిద్ర పడుతుందని అంతేకాక మరుసటి రోజు ఉదయం చురుకుగా ఉంటుందని బ్రిటన్ పరిశోధకులు అంటున్నారు. ఎడమ వైపు తిరిగి పడుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు. సుమారు మూడు వేల మంది పై ఈ పరిశోధన జరిపారు. కుడి వైపుకు తిరిగి పడుకునే వారి కన్నా ఎడమ వైపు తిరిగి పడుకునే వారే ఎక్కువ చురుకుగా ఉత్సాహంగా ఉండటాన్ని గమనించారు. అలంటి ఉత్సాహంతో పని వత్తిడి ఫీల్ అవ్వరని ఆహారం త్వరగా జీర్ణం అవుతుందని చెప్పుతున్నారు. ఇంతకూ ముందు అలవాటు లేకపోయినా ఇప్పుడు కొత్తగా అయినా సరే ఎడమ వైపు తిరిగి నిద్రించేందుకు ప్రయత్నించామని సలహా ఇస్తున్నారు.

Leave a comment