Categories
వ్యాయామం తో పది రకాల కాన్సర్ లను దూరం పెట్టచ్చు అంటున్నాయి తాజా అధ్యయనాలు. అమెరికా యూరప్ లలో నిర్వహించిన అధ్యయానంలో ఈ వాస్తవం నిరూపితమైంది. నిత్యం వ్యాయామం చేసేవాళ్ళలో ఈ సోఫేజయిల్ ఎడినోకోర్సి నోమా అనే ఒక తరహా కాన్సర్ తో పాటు కడుపుకు,రక్తానికి ఊపిరి తిత్తులకు పెద్దప్రేగులు తల మెడలకు సంబందించిన కాన్సర్లు దూరం అవుతాయని తేలింది . వ్యాయామం వల్ల శరీరాన్ని ఉత్తేజపరిత ఎండోక్రైన్ స్రానాలు తగినంత మోతాదులో విడుదల అవుతాయని,దానితో అన్ని వ్యవస్థలూ పూర్తిగా మంచి అదుపులో ఉంటాయని. అన్ని వ్యవస్థల మధ్య నుంచి సమతుల్యత సాధ్యమవుతుందని అధ్యయన వేత్తలు చెపుతున్నారు.