కొన్ని వస్తువులు చూసేందుకు చాలా ముద్దుగా ఉంటాయి. అది ఫ్యాషన్ గా వుంటే, నలుగురి ద్రుష్టి పడేలా వుంటే, ఉపయోగంగా వుంటే ఇక దాని దారే వేరు. మనం పౌడర్ ను ముఖానికి సమంగా వేసుకోవాలంటే స్పాంజు లాంటి పఫ్ ని వాడతాం. అయితే వీటి స్థానంలో సిలికాన్ తో చేసిన, పారదర్శకంగా వుండే సిలీ స్పాంజులు వస్తున్నాయి. మాములు స్పాంజుతో సన్నని రంద్రాలు వుండటం వల్ల చాలా పౌడర్ వృధా అవుతుంది. అదే జారి పోయే ఉపరితలంతో వుంటే ఈ సిలీ స్పాంజ్ వల్ల, స్పాంజితో పోలిస్తే సగం పౌడరే పడుతుంది. చూసేందు చాలా కొత్తగా వుంది. ఆర చేతిలో వుంచుకుంటే అసలు అది అద్దపు బిళ్ళలాగా కనిపించనే కనిపించదు. అయితే ఈ సిలీ స్పాంజ్ లో కూడా కలర్స్ వున్నాయి. ఒక్కసారి ఇమేజస్ చుస్తే అవెంత బావుంటాయో తెలుస్తుంది.

Leave a comment