ఎప్పుడూ ఒకే రకమైన శరీర లావణ్యం వుండదు. వయస్సు పెరుగుతున్నా, పిల్లలు పుట్టినా కొద్ది పాటి మార్పులు వస్తాయి. కాస్త పొట్ట ఉచ్చేత్తుగా కనబడటం ఇబ్బంది పెట్టే విషయాల్లో ఒక్కటి. కొద్ది జాగ్రత్తలతో ఈ సమస్య నుంచి బయట పడవచ్చు, పొట్ట కనిపించకుండా బెల్ట్ ఉపయోగించవచ్చు. దాన్ని పొట్ట పై భాగంలో, ఛాతీకి కిందగా వుంచుకోవాలి. అలాగే పెద్ద పువ్వులున్న టాప్ ఎంచుకోవాలి. బిగుతుగా వుండే దుస్తుల జోలికి వెళ్ళక పోవడం మంచిది. మంచి రంగులు ఎంచుకోవచ్చు. ముదురు రంగు దుస్తులు కాస్త వదులుగా వున్నవి పొట్ట కనిపించనీయావు. నిలువు చారలున్న టాప్ ఎంచుకోవడం మంచిది. పొడవాటి రంగు రంగుల మెరిసే టాప్ లు, టైట్ గా వుండే లెగ్గింగ్స్ వేసుకోవచ్చు. ఈ మార్పుల వల్ల ఆకృతి తేడా తెలుస్తుంది.

Leave a comment