ఎండలు ఎక్కువగా ఉన్నాయి కనుక ముఖం ఎండ వేడికి కమిలిపోకుండా ఫ్రూట్ ప్యాక్ వేసుకుంటే మేలు. ముందుగా ముఖం నీళ్లతో శుభ్రం చేసుకుని పాలతో కూడిన క్లెన్సర్ వాడాలి. చిన్న గిన్నెలో పాలు పోసి అందులో కాటన్ బాల్ ను మంచి మెడ ,ముఖం చుట్టు  రుద్దాలి.   తరువాత నిమ్మరసం వేసినా స్క్రాబ్బర్ తో రుద్దితే చర్మం పైన మలినాలు పోతాయి పొడిబారిన చర్మానికి తేనె రాసి  పది నిమిషాలు ఆగి నీళ్లతో శుభ్రం చేసుకోవచ్చు.అరటిపండు, కీరదోస, తేనె పెరుగు మెత్తని పేస్ట్ గా చేసి ముందుగా ఫ్రిజ్ లో ఉంచి చల్ల బడ్డాక దానితో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుంటే మొహం మెరుపుతో ఉంటుంది.

Leave a comment