పంచదార లేకుండా టీ తాగడం అంటే కష్టం అనుకునేవాళ్ళు స్టెవియా ఆకు పొడిని టీలో వేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా వాసన ఏమీ ఉండదు. పంచదార కంటే రెండువందల నుంచి మూడు వందల రెట్లు అధిక తియ్యదనం కలిగి ఉంటుంది.పోషకపదార్ధాలు లేని కేలరీలు అందించని ఔషధపొడి స్టెవయా. దీన్ని పలు రకాల ఆహారపదార్ధాల్లో కలుపుతారు. స్టెవియా ఆకుగానీ ఆకు పొడిగానీ వాడటం వల్ల రక్తంలో చెక్కర స్థాయి పెరగడం ఇన్సులిన్ స్థాయి రక్తపోటు శరీరం బరువు వంటి వాటి పైన ఎలాంటి ప్రభావం చూపెట్టదని అధ్యాయనాలు చెభుతున్నాయి. స్టెవియాతో చేసిన తీపి పదార్ధాలు తినవచ్చు.

Leave a comment