Categories
ఈ చలిగాలులకు మాడు పొడిగా అయిపోయి పొలుసులు రేగి దురద పెడతాయి.శిరోజాల అందం మెరుపు తగ్గుతాయి.మాడులో తేమ తగ్గిపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది.గోకితే రేగే పొలుసులు చుండ్రు కాదు. పొడిబారడం వల్ల రేగుతాయి. రోజు రాత్రి పడుకోబోయే ముందర మాడుకి తేలిగ్గా మాయిశ్చరైజర్ అప్లయ్ చేస్తే ఉదయం స్నానం చేశాక పొలుసులు ఉండదు.నీరు ఎక్కువ తాగిన ఈ సమస్య పోతుంది. ప్రతి రోజు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళతో పాటు,గుడ్లు,చేపలు,మాంసం,నట్స్ తినాలి.ముఖ్యంగా విటమిన్ బీ6,బీ 12 కూడా చాలా అవసరం. పసుపు ఆరెంజ్ కలర్ కూరగాయలు తినాలి క్యారెట్లు చిలగడ దుంపలు బొప్పాయి ఇందుకు సహకరిస్తాయి.