వైకల్యంతో వీల్ చైర్ కే పరిమితం అయినా ఇందిరా ప్రేమ్ ఇల్లమ్ పేరుతో షెల్టర్ హోం నడుపుతూ ఎంతో మంది పిల్లలను ఆదరిస్తోంది. అయిదేళ్ల వయసులో పోలియో తో 90 శాతం వైకల్యానికి గురైన ఇందిరా అన్నయ్య సెల్విన్ సహకారంతో  ఎం.సి.ఎ చదివింది. సెల్విన్ స్థాపించిన ప్రేమ్ ఇల్లమ్ నే సొంతం చేసుకోని 2017 నుంచి సేవలందిస్తోంది. అక్కడ పిల్లలకు చదువు చెప్పటం కోసం ఇందిరా స్పెషల్ ఎడ్యుకేషన్ లో బి.ఇడి చేసింది. సమాజ హితం కోరి ఒక మంచి పని తలపెట్టేందుకు వైకల్యం అడ్డురాదని నిరూపించింది ఇందిరా.

Leave a comment