చక్రాల కుర్చీలో కూర్చొనే పారా ఒలింపిక్స్ లో పాల్గొని ఒకేసారి రెండు పథకాలు గెల్చుకొన్నది. తొలి భారత యువతిగా చరిత్ర సృష్టించింది. 19 ఏళ్ల అవని లేఖారా ఏడేళ్ళ వయసులో ఒక ఆక్సిడెంట్ లో అవని వెన్నెముక దెబ్బతిని నడుము కింది భాగం చచ్చు పడిపోయింది. ఆటలన్నా, నృత్యం అన్నా ఇష్టపడే అవని చక్రాల కుర్చీకే పరిమితం అయ్యాక అభినవ్ బింద్రా ఆత్మకథ ‘ఎ షాట్ ఎట్ హిస్టరీ’ చదివి ఆ స్ఫూర్తితో తుపాకీ పట్టుకొని జైపూర్ లో శిక్షణ తీసుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పథకాలు గెలిచాక పారా ఒలింపిక్స్ లక్ష్యంగా కోవిడ్ సమయంలో బయటకు కదిలే పరిస్థితి లేకపోయినా జూమ్ లోనే శిక్షణ తీసుకొని టోక్యో లో అడుగుపెట్టి పతకాలు సాధించింది.

Leave a comment