సమంత అక్కినేని వ్యాపార సంస్థ పేరు సాకీ. ఇందులో సుశృతి కృష్ణ భాగస్వామిగా ఉంది.సుశృతి ఆర్కిటెక్టర్ చదివింది. 2016 లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. గత సంవత్సరం సాకీ బ్యానర్ కింద తొలి బ్రాండ్ గా మెర్క్ ను ప్రారంభించింది. దీని ద్వారా ఫ్యాషన్ లైఫ్ స్టయిల్ ఇతర అంశాల్లో వివిధ బ్రాండ్ లను అందుబాటులోకి తేవాలనే ఆలోచన. తనకు పరిచయం అయిన సమంత తో ఆలోచన పంచుకుంది సుశృతి. సమంత ప్రాజెక్ట్ నచ్చటంతో కో ఫౌండర్ గా నిలబడింది. సాకీ బ్రాండ్ దుస్తులు యు.ఎస్.ఏ, మలేషియా, సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియా తోపాటు యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

Leave a comment