నీహారికా ,

ఒక చక్కని రిపోర్ట్ వచ్చింది. సాయంచేస్తే ఆయుష్షు పదిలంగా ఉంటుందని ఒక అధ్యయనం రిపోర్ట్ వివరాలు ఇబ్బంది 5000 మంది పైన దీర్ఘ కలం ఈ ప్రయోగం చేశారట. ఇతరులకు సాయం చేయటానికి ఆయుర్ధాయం ఆరోగ్యం పెరగటానికి సంబంధించిన పరిశోధన ఇది. ఇందులో ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకున్నారు. వారి జీవన శైలి వారి కుటుంబ సభ్యులతో వారికున్న అనుబంధం ఇతరులతో చేదోడువాదోడుగా మెలగటం వంటివి సంవత్సరాల తరబడి రికార్డు చేసారు. వీళ్ళను రెండు గ్రూపులుగా వాళ్ళ ఆలోచనా స్థాయిని బట్టి విభజించారు. అందరు ఆరోగ్యం మంచి ఉద్యోగం సంఘం లో హోదా ఉన్నవాళ్లే . వాళ్ళు ఇతరులకు సాయపడే అంటే ఆర్ధికంగా మాత్రమే కాదు ఇతరుల అవసరాల్లో సంతోషాల్లో ఆపదల్లో పాలుపంచుకునే శైలిపై ఆలోచన సాగితే ఇతరులతో కలిసి మెలిసి ఉండేవాళ్ళు తమకి కలిగే చిన్న చిన్న అనారోగ్యాల నుంచి చాలా తేలికగా బయటపడగలరట. వాళ్ళ ఆయుర్ధాయం రెండు మూడేళ్లు ఎక్కువే రికార్డఅయ్యిందట. కేవలం జీవిత కలం పెరగటానికి ఒకే కారణం వాళ్ళు ఇతరులకు సహాయపడటం తో ఆనడం పొందటం లేదా పనిలో ఆనందం పొందటం కారణాలుగా ఉన్నాయి. బావుంది కదా ఈ రిపోర్ట్.

Leave a comment