Categories
కీరదోస తినటం మంచిదే కానీ ఇది చర్మ సౌందర్యాన్ని ఇచ్చే విషయంలో మాత్రం ఓ అడుగు ముందే వుంటుంది. కీర దోస కాయ గ్రయిండ్ చేసి ఆ గుజ్జును ఫేస్ మాస్క్ లా వేసుకుంటే మొటిమలు, నల్ల మచ్చలు, ముడతలు, పొడి చర్మం లాంటివి ఇబ్బంది పెట్టావు. అలాగే రెండు టేబుల్ స్పూన్ ల ఓట్ మీల కీర దోస గుజ్జు పాలు కలిపి మొహం పై అప్లయ్ చేసి ఎరవి నిమిషాల తర్వాత వేడి నీటి తో కడిగేసి చూడండి ముఖ చర్మం మృదువుగా మెరుస్తూ కనిపిస్తుంది. కీరదోస ముఖానికి తేమను పోషణను ఇస్తుంది. ఇందులో ఆస్ట్రీంజెంట్ గుణాలున్నాయి. చర్మం పై వుండే ఆమ్ల పూత తగ్గిపోతే ఈ కీర దోస గుజ్జు దాన్ని తిరిగి చర్మం పై ఉంచేలా సాయపడుతుంది.