స్ట్రైట్ హెయిర్ ఇప్పుడు అమ్మాయిలు మెచ్చే స్టైల్ ఇది ఎఫ్పటికి అవుటాఫ్ బ్రాండ్ కానే కాదు.క్రమం తప్పని హాట్ ఆయిల్ థెరఫీ వల్ల శిరోజాలు కండీషన్ అయి చక్కగా వస్తాయి.స్ప్రే బాటిల్ తో జుట్టు పై పాలు అప్లై చేసి అరగంట తర్వాత షాంపు అప్లై చేస్తే పాలు శిరోజాలకు తిన్నగా చేరేందుకు ఏజెంట్ గా పనిచేస్తాయి.పాలలో కొంచెం తేనె కలిపినా మంచిదే.పాలు తేనె మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి బాగా ఆరాక కడిగేయాలి. స్ట్రాబెర్రి,అరటి పండు గుజ్జు కూడా జుట్టును పట్టు కుచ్చులా చేస్తాయి.కొబ్బరి పాలు తీసి నిమ్మరసం కలిపి ఫ్రిజ్ లో ఉంచితే పైన మీగడలా కడుతుంది. ఈ క్రీమ్ తలకి అప్లయ్ చేసి వేడి టవల్ చుట్టుకుంటే చాలు.ఓ అరగంట ఆగాక తలస్నానం చేస్తే జుట్టు మెరుస్తుంది.

Leave a comment