Categories
దిండు లేకుండా చాలా మందికి నిద్ర పట్టదు. కొందరు చాలా ఎత్తుగా ఉండేలా దిండు వేసుకుంటున్నారు. అయితే నిద్ర లేచేసరికి మెడ నొప్పిగానో, పట్టేసినట్లు గానో వుంటే దిండు సరైన పొజిషన్ లో వుంచుకోలేదని అర్ధం. రాత్రి వేళ పడుకున్న తీరు, దిండు ఏ విధంగా తలకింద పెట్టుకున్నామన్న దాని పై ఈ నొప్పిని విశ్లేషించాలని డాక్టర్లు చెప్పుతున్నారు. స్పైన్ సహజ వంపులకు సపోర్టు లేని పక్షంలో తలను బాగా ముందుకి వెనక్కి వంచాల్సి వస్తుంది. దీని వల్ల నొప్పి వస్తుంది. సర్వికల్ స్పైన్ సహజమైన వంపును మెయిన్ టైన్ చేయగల దిండు ఎంచుకోవడం మంచిది. ఓ పక్కగా తిరిగి పడుకునేటప్పుడు బుజం, చుబుకనికి నడుమ అలా ప్రదేశానికి దిండు సపోర్టు అయ్యేలా వుండాలి మరీ ప్లాట్ గా మరీ ఎత్తుగా వున్న వాటి పై తల పెట్టి పడుకోవద్దు.