Categories
ఇప్పుడు సూపర్ ఫుడ్ గుమ్మడి గింజలే. నిద్ర పట్టడం లేదా? గుమ్మడి గింజలు గుప్పెడు మందు. సన్నగా అవ్వాలా? మళ్ళీ ఈ గింజలే, రక్త హీనట వుంటే రెండు స్పూన్లు. కానీ వట్టి గింజలెలా తినాలి. మనం వేరు సెనగ బెల్లం కలిపి చెక్కీలు చేసుకున్నట్లే గుమ్మడి గింజలు బెల్లం కలిపి పాకం పట్టించుకోవచ్చు. ఇవి రోస్ట్ చేసుకోవచ్చు. ఆ గింజల పైన వెన్న, ల్లాం పొడి ఉప్పు కలిపి తినచ్చు. ఇదివరలో వీటిని కేకుల పైన కుకీస్ పైన గర్నీషింగ్ కు వాడేవాళ్ళు. ఇప్పుడు చీజ్, చాకొలెట్ బార్స్, బట్టర్ లాంటివి ఎన్నో చేస్తున్నారు. ఈ గింజలను కేవలం ఔషడం లాగా వాడటం ఇప్పుడో మొదలైంది. ఇందులో మెగ్నీశియం చాలా ఎక్కువ. గుండెకు చాలా బలం ఇస్తాయి.