ఎంతో ఖరీదు పెట్టి కొనే క్లెన్సర్ల కంటే చిన్ని చిన్ని చిట్కాలతో చర్మ సంరక్షణ చేసుకోవచ్చు అనుకుంటున్నారు ఎక్స్పర్ట్స్. ఆరోగ్యంగా అందంగా మెరిసి పోయేందుకు రకరకాల పూతలు, అవసరమే లేదంటారు. కొబ్బరినూనె, ఆలివ్ నూనెల మిశ్రమంలో చక్కెర గానీ, బ్రౌన్ షుగర్ గానీ వేసి, మొహం, మెడా, మోచేతులు రుద్దుకుంటే మ్రుతకణాలు పోయి చర్మం తేమగా మెరిసిపోతుందని చెప్పుతున్నారు. నాణ్యమైన క్రీములతో కుడా ఒక్కసారి చర్మపు మెరుపు కనిపించదు. బంగాళదుంప తొక్కలు ఉడికించిన నీళ్ళతో ముఖం కడుక్కుని చూడండి ఎంత లేదా తెలుస్తుందో అంటున్నారు. స్నానం చేసే నీళ్ళలో రెండు చుక్కల ఆలివ ఆయిల్ వేస్తే ప్రత్యేకించి మాయిశ్చురైజర్ అవసరమే లేదంటున్నారు. ఈ చిన్న పాటి చిట్కాలతో చర్మానికి తేమ అంది చూసేందుకు ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తుంది.
Categories