Categories

నలబై ఏళ్ళు రాకుండానే జుట్టు తెల్లబడుతుంది. కాస్త ముందస్తు జాగ్రత్త తో ఈ తెల్ల జుట్టు అరికట్టవచ్చని ఎక్స్ పార్ట్స్ చెప్పుతున్నారు. కొబ్బరి నూనె లో కర్పూరం కలిపి రాత్రి పడుకునే ముందర తలకు పట్టించి మసాజ్ చేయాలి. అలాగే తలస్నానం కోసం షాంపులు కాక కుంకుడుకాయ శీకాయ వాడాలి. తలస్నానం పూర్తి అయిన తర్వాత చీటీ వేళ్ళ కొనలతో మసాజ్ చేస్తే బ్లడ్ సర్కిలేషన్ పెరిగి జుట్టు కుదుళ్ళు గట్టి పడతాయి.వారానికి రెండు సార్లు అయినా కొబ్బరి నూనె తో మసాజ్ చేసి తలస్నానం చేయాలి. కొబ్బరి నూనె లో నిమ్మ రసం వేసి గోరు వెచ్చగా చేసి కుదుళ్ళకు పట్టించడం వల్ల కుడా ఫలితం వుంటుంది. ఎంతో ఖరీదైన తలనునెల కన్నా ఈ సహజమైన మర్గాలే జుట్టు తెల్లబడకుండా చేయగలవు.