రాగి వంటి తృణ ధాన్యానికి వందల కోట్ల రూపాయిలు మార్కెట్ ఉందిట. ఓట్ మీల్ వంటి విదేశీ హెల్త్ ఫుడ్ తో పోలిస్తే మన ప్రాంతంలో పాండే రాగులు చాలా చవక కూడా. పాలిష్ చేసిన బియ్యం, గోధుమల వల్ల ఒరిగింది ఏమి లేదని తేలాక అందరి దృష్టి రగుల్లాంటి తృణ ధాన్యాల వైపు మళ్ళింది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు పళ్ళెంలో ముందుగా చోటు కల్పించ వలసింది రాగులకే అంటారు న్యుట్రీషనిష్టులు. రాగుల్లోని ట్రెపోఫాన్ అనే అమైనో ఆమ్లం ఆకలిని తగ్గిస్తుంది. రాగుల్లో కాల్షియం ఎక్కువ కనుక ఎదిగే పిల్లలకు రాగులు ఎదో ఒక రూపంలో ఇవ్వాలి. గర్భిణులకు ఇది మంచిదే మహానగరాల్లో రాగులకు ఆదరణ పెరుగుతుంది. స్టాక్ రెస్టారెంట్స్ లో రాగి ముద్ద, రాగి పుట్టు, రాగి దోస, రాగి కుకీస్, రాగి కేకు కనిపిస్తాయి. రెడీ టు కుక్ రాగి దోస, రెడీ టు కుక్ రాగి రవ్వ ఇడ్లి మిక్స్ లు అందుబాటులో కొచ్చాయి. బ్రిటానియా రాగి బిస్కెట్ లు వచ్చాయి. గత ఎడేళ్ళల్లో రాగుల ధరలు 270 శాతం పెరిగాయట. ఇంత మంచి రాగులను ఆహారం లో చేర్చుకుని హాయిగా ఆరోగ్యంగా ఉండొచ్చు కదా! పోషకాహర లోపం సరిదిద్దేది రాగి ఒక్కటేనని అంతర్జాతీయ ఆహార సంస్థ తెలుపుతుంది మరి!
Categories