ఇంట్లో తాయారు చేసుకున్న స్క్రబ్ లు ఒక రకంగా పేరున్న కంపెనీలు ప్యాక్ చేసి అమ్మే వాటి కంటే బాగా పని చేస్తాయి. ఇందులో వాడేవి రాసాయినాలు లేనివి కనుక సైడ్ ఎఫెక్ట్ లు వుండవు. ఆరంజ్ పీల్ పొడి, ఓట్స్ ఒక్కటి, ఒక్కో స్పూన్ చొప్పున తీసుకుని అందులో సరిపడా తేనె కలిపి ముఖం మెడ పై సర్కులర్ కదలికల తో అప్లయ్ చేయాలి. అలాగే అరటి పండు, పంచదార పొడి, ఓ టేబుల్ స్పూన్ తేనె కలిపినా మిశ్రమం కూడా మంచి స్క్రబ్. పెరుగు,  పండిన బొప్పాయి గుజ్జు, నిమ్మ రసం తేనె కలిపి మసాజ్ చేసినా మంచి ఫలితం. నిమ్మ కాయ సగంగా కోసి రెండు చెంచాల పంచదార పొడిలో అద్ది ముఖం పై సున్నితంగా మసాజ్ చేయాలి. ముందుగా ముఖంపై చల్లని నీరు చల్లుకుని, ఈ  స్క్రబ్  ఎదో ఒక్కటి ఒక స్పూన్ తీసుకుని ముఖం పై మసాజ్ చేయాలి. కళ్ళ కింది భాగం వదిలేయాలి. ఎక్కువ ప్రెజర్ ఉపయోగించ కూడదు. రెండు నిముషాల మించి  స్క్రబ్  చేయకూడదు.  ఇంట్లో వీటిని చాలా తేలికగ్గా తాయారు చేసుకో వచ్చు.

Leave a comment