మైక్రో వేవ్ లో పదార్ధాల తయారీ మంచిదా కాదా అన్న సందేహాలు, చర్చలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. పోషకాలు పోతాయని, అంత వేడిలో సహజమైన రుచి పోతుందని చాలామంది అంటున్నారు కానీ ఇది నిజాం కాదు ఏ రకం వంట పద్దతిలో అయినా కొన్ని పోషకాలు, విటమిన్లు పోవడం సహజం. మిగతా వాటి తో పోలిస్తే మైక్రో వేవ్  లో తక్కువ పోషకాలు తక్కువ పోతాయి. పోషకాలు పోవడం అనేది ఉష్ణోగ్రత వంటి సమయం పై ఆధార పడి వుంటుంది. మైక్రో వేవ్ లో విటమిన్లు వేడి తక్కువ సమయంలో మాత్రమే ఎక్స్ పోజ్ ఆవుతాయి. ఎక్కువ భాగం హీట్ సెన్సిటివ్ న్యూట్రిషన్లే నీటిలో కరిగే విటమైన్లు ఫాలిక్ యాసిడ్, బి,సి విటమిన్లు వంటివే కనుక పాలకూర(ఫోలెట్), బెండకాయ(విటమిన్-సి), మాంసం(విటమిన్-బి) ఇవి అతిగా ఉడికిస్తే విటమిన్లు పోతాయి. అందుకే మైక్రో వేవ్ లో అతి తక్కువ సమయంలో కావాల్సినంత వేడెక్కుతాయి కనుక సందేహం లేకుండా ఉపయోగించ వచ్చు.

Leave a comment