అందరికి వెలుగు లోనే తినే అలవాటు ఉంటుంది . అసలు చీకట్లో తినాలనే ఊహ అయినా దాదాపు రాదు . ఏదో ప్రత్యేకత ఉంటే బావుంటుంది . అనుకున్నారేమో గానీ చైనా లోని బీజింగ్ లోని ఓ రెస్టారెంట్ కు వెళితే అక్కడ చీకట్లోనే భోజనం చేయాలి . ఆ రెస్టారెంట్ పేరు కూడా డార్క్ రెస్టారెంట్ . లైట్స్ ,క్యాండిళ్ళు పని ఉండవు అంతా చీకటిమయం . అన్ని తడుముకుంటూ వాసనని బట్టి తినాల్సిందే . కానీ వడ్డించే వాళ్ళు మట్టుకు వైట్ విజన్ గాగుల్స్ పెట్టుకొని ఫుడ్ సర్వే చేస్తారు . ఆసియా లో ఇదే మొదటి చీకటి రెస్టారెంట్ . కానీ ఈ అనుభవం కోసం జనం క్యూ కడతారట .

Leave a comment