కొందరి ముక్కులు ఎంత దూరంలో ఎలాంటి వాసనని అయినా ఇట్టే పసి గట్టేస్తాయి. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే పరిసరాలను బాగా గుర్తు పెట్టుకోగలిగినా వాళ్ళకే ఈ వాసనలు పసిగట్టే శక్తి ఎక్కువగా ఉంటుందట. డగ్లస్ మెంటల్ హెల్త్ యూనివర్సిటీ నిపుణులు కొందరు యువతి యువకుల పై ఈ పరిశోధన చేశారు. వాళ్ళను ఆయా వీధుల్లో ఉండే ల్యాండ్ మార్క్స్ గురించి ప్రశ్నలు అడిగారు. వాళ్ళ పైన తులసి,స్ట్రాబెర్రి,దాల్చిన చెక్క,గంధం,కస్తూరి వంటి 40 సువాసనల గురించి గుర్తించమని కోరారట.దారుల్నీ పసిగట్టిన వాళ్ళు వాసనలు పసిగట్టారు. ఆ సమయంలో వాళ్ళ మెదడు స్కాన్ చేస్తే ఈ రెండిటికి కారణం మెదడు లోని ఒక భాగమే అని తేలిందట.

Leave a comment