Categories
Nemalika

పొదుపును కూడా అలవాటు చేసుకోవచ్చు.

నీహారికా,

ఎంతో జీతం సంపాదించే వాళ్ళు కూడా చాలా కొద్ది మొత్తమైనా సేవ్ చేయలేకపోతున్నామంటుటారు. కానీ ఈ ఆదా అనేది పక్కా ప్రణాళిక ప్రకారం చేయకపోతే ఇలాగే వుంటుంది. ముందుగా అయిదారేళ్ళ తర్వాత ఎంత డబ్బు ఆదా చేయలనుకొన్నారో ఓ పుస్తకం పైన రాసుకుంటే ఆ డబ్బు ఎన్ని విధాలుగా దాచాలనేది స్పష్టత వస్తుంది. రోజూవారీ ఖర్చులు ఓ పుస్తకంలో రాసుకుంటే నెల గడిచాక ఓసారి చెక్ చేస్తే వృధా ఖర్చులు ఎన్ని వున్నాయో తెలుస్తుంది. అలా దుబారా అనుకున్న డబ్బును ఆదా చేయచ్చు. షాపింగ్ విషయంలోను ఒక స్పష్టత ఒక బడ్జెట్ వుండాలి. ఏది అవసరం దాన్ని ఎన్నాళ్ళు వాడబోతున్నాం అన్న దానిపైన షాపింగ్ ను మొదలు పెట్టాలి. స్నేహితులతో సరదాగా షాపింగ్ మానేయడం బెస్ట్. పార్టీలు, హోటళ్ళూ అంతే. ప్రతిదానికీ ఒక గీత గీస్తూ వస్తే అవసరం ఉన్నంతవరకే ఖర్చు పెట్టడం అవుతుంది. కోటీశ్వరులైన వాళ్ళు తమ విలాసం కోసం, భోజనం కోసం, బట్టల కోసం డబ్బు అనవసపు వృధా చేయరు. డబ్బును ఆస్తులు కొనటం కోసమే సంపాదిస్తున్నారట. వీలైతే ‘ రిచ్ డాడ్ పూర్ డాడ్’ అన్న పుస్తకం మార్కెట్ లో దొరుకుతుంది చదువు. ఈ పుస్తకం గురించి ఇంకోసారి చెపుతా.

Leave a comment