జీన్స్ ఎలా వేసినా ఫ్యాషనే. చిరుగులతో వున్నా బురద అంటించుకున్నా. సగం రంగు పోయి పాత గుడ్డల్లా కనిపించినా. యువత వాటిని అంటి పెట్టుకునే ఉన్నారు. ఇప్పుడీ జీన్స్ రెండు పాంట్లు కలిపి కుట్టినట్లు, రెండు రంగులు, రెండురకాల, ప్రింట్లు, మోకాళ్ళ వరకు ఒక రంగు, పై వరకు ఇంకో రంగులో టూటోన్ జీన్స్ ఇప్పుడు మార్కెట్లో కనిపిస్తాయి. ముందునుంచి చుస్తే నలుపు, ఒకే రంగులో లేత ముదురు వర్ణాలు కలగలిపి, ప్యాంటు లో ఒక కాలు ఇంకో రంగులో, స్ప్లిట్టేడ్ లెగ్ జీన్స్ ఇంకో కొత్త అందం ఇవన్నీ అబ్బాయిలకు, అమ్మాయిలకు కలిపే దొరుకుతున్నాయి. ఇప్పుడు సగం సగం కలిపి ఓ ప్యాంటు యూత్ ఫ్యాషన్.

Leave a comment