వర్షాకాలం రాగానే డ్రస్ కోడ్ మార్చేయాల్సి వస్తుంది . అప్పటి వరకు కాటన్ లో సుఖంగా అనిపిస్తాయి . వర్షాలకు తడిసి బురద మరకలు అవుతాయని ,వంటికి అతుక్కు పోతాయని కాటన్స్ అవతల పెడతారు . దుస్తుల ఎంపికలో శ్రద్ధ చూపెడితే ఈ సీజన్ లోనూ కాటన్ లు బాగానే ఉంటాయి అంటారు ఎక్స్ పర్డ్స్ . పొడవాటి గౌన్లు లేయర్డ్ కుర్తాలు ,అనార్కలీలు కాస్త దూరం పెట్టి మడమ వరకు ఉండే క్యాట్ ఫ్రీ లు ,ఆఫ్ లెంగ్త్ సలజ్ లు ,లెగ్గింగ్ లు ఎంచుకోవచ్చు . తోలుతో తయారైన చెప్పులు వర్షాలకు నానితే పాడాయి పోతాయి కనుక జెల్లీ షూలు ,ప్లోటాక్స్ వీలుగా ఉంటాయి . జార్జెట్, సిఫాన్ వస్త్ర శ్రేణి తో తయారు చేసిన దుస్తులు కాస్త తడిసినా వెంటనే ఆరిపోతాయి కనుక అని ఈ వాతావరణానికి సరిపోతాయి .

Leave a comment