భారతదేశపు బయోటిక్ రంగపు మహారాణి కిరణ్ మంజుందార్ షా . ఫోర్బ్స్ ప్రకటించిన అత్యంత శక్తి మంతమైన మహిళల జాబితాలో కిరణ్ మంజుందార్ షా కు 65వ స్థానం లభించింది . 2016 మహిళల జాబితా లోను ఈమె పేరున్నది . బయోటిక్ రంగంలో ప్రసిద్ధ భారతీయ కంపెనీ బయోకాన్ స్థాపించి నడిపిస్తోంది . డయాబెటిక్ రోగుల ప్రాణాలను కాపాడే ఇన్సులిన్ ను తయారుచేసే అతిపెద్ద ఆశియా ఖండ కంపెనీ ఆమెది . మహిళలు  టీచింగ్ కు నర్సింగ్ కు స్టెనో ఉద్యోగాలకు మించి పనికిరాదనుకొనే కాలంలో ఆమె బీర్ తయారు చేసే చదువు చదువుతానంటే ప్రతిచోట ఆశ్చర్యమే డయాబెటిక్ తో పాటు కాన్సర్ సోరియాసిస్ వంటి వ్యాధులకు ఔషదాలు తయారు చేస్తోంది బయోకాన్ . ఈ విభాగాలు అన్నింటిని కిరణ్ స్వయంగా పర్యవేక్షిస్తుంటారు .

Leave a comment