మన శరీరంలో విశ్రాంతి లేకుండా పనిచేసేది శ్వాసకోశాలే . ఆయష్షుని ఆరోగ్యాన్ని పెంచే ఈ శ్వాస కోశాలు పట్ల మనం ఎలాంటి శ్రద్ధ తీసుకోమ్. రోజూ పది పదిహేను నిముషాలు లోతైన శ్వాస తీసుకోగలిగినా శ్వాస కోశాల శక్తి పెరుగుతోంది. స్విమ్మింగ్ జాగింగ్ ట్రెకింగ్ లాంటి ఏ వ్యాయామమైన ఊపిరితిత్తుల శక్తి వృద్ధి చేసేవే. సహజంగానే నీటికి ఎన్నో వ్యాధుల్ని నయం చేసే శక్తీ వుంది. సరిపడా నీళ్లు తాగితే చాలు. రక్త ప్రసరణ పెరిగి శ్వాస కోశం తేమగా వుంటూ ఎక్కువ ఆర్గ్యంగా పనిచేస్తాయి. ఉల్లి వెల్లుల్లి లాంటివి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. కాప్సికమ్ కూడా శరీరంలో ఇన్ఫెక్షన్లను వ్యతిరేకంగా పోరాడే శక్తిని నిలుపుతాయి. నాట్స్ ఇతర ధాన్యాలు సిట్రస్ పండ్లు గుమ్మడికాయ క్యారెట్లు వల్ల కూడా ఈ ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. గ్లాసు పాలలో కాస్త పసుపు వేసి తాగితే శ్వాసకోసం లో ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడే శక్తీ పెరుగుతుంది. అల్లంలో వాపు తగ్గించే గుణం వుంది కనుక దాన్ని ఎక్కువగా వాడితే మంచిది.
Categories