గుడ్డు పోషకాహారం గానే కాదు సౌందర్యాన్నిచ్చే విషయంలో కూడా ఎంతో ప్రయోజనకారి.చర్మాన్ని శుభ్రం చేస్తుంది ముఖం పై బ్లాక్ హెడ్స్ తొలగిస్తుంది. చర్మం బిగుతుగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.గుడ్డు లోని తెల్ల సొన తీసుకొని దానికి స్పూన్ నిమ్మరసం కలిపి గిలకొట్టి పెట్టుకోవాలి.దానికి కాస్త బియ్యం పిండి కొద్దిగా తేనె అవసరాన్ని బట్టి కలిపి గోరువెచ్చని నీళ్ళు కలిపి పేస్టులా చేసుకోవాలి. దానితో ప్యాక్ వేసుకొని బాగా ఆరిపోయాక కడిగేసుకోవాలి.వారానికో సారి ఇలా ప్యాక్ వేసుకుంటే ముడతలు,గీతలు తగ్గి చర్మం యవ్వన వంతంగా ఉంటుంది.

Leave a comment