Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2018/03/Presentation1.jpg)
వేసవిలో హాయిగా ఆహ్లాదంగా ఉండాలంటే కొన్ని ఇంటిచిట్కాలు చక్కటి పరిష్కారం. ఈ సీజన్ వస్తూనే కర్బూజా,పుచ్చకాయ వంటి వాటిలో ఎక్కువ నీరు ఉంటుంది కనుక ఈ పండ్లు తింటే అతి దాహం ఉండదు. పెరుగు,తేనె, పండ్లు కలిపి తింటే దాహాం తీరుతుంది. కర్భూజా పండ్ల ముక్కల పై కొంత ఉప్పు చల్లి తింటే శరీరంలో కోల్పోయిన లవణాలు భర్తీ అవుతాయి. కొబ్బరి నీళ్ళు, అలాగే రాగి మాల్ట్ ఎంతో మంచిది. రాగి మల్ట్ లో నిమ్మరసం, ఉప్పు కలుపుకోవాలి, అన్నింటికంటే ఉత్తమమైన వేసవి పానీయం మజ్జిగ. అందులో కరివేపాకు , నిమ్మరసం కలుపుకొని తాగితే వేసవి సమస్య లేనట్లే.