Categories
ఇండియాలో మొట్టమొదటిసారి ఒక మహిళ నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికేట్ తీసుకుని చరిత్ర సృష్టించింది. కులాలను 1950లోనే నిర్మూలించారు. కాని ప్రతి సర్టిఫెకెట్ లోని దానికి సంభందించిన బాక్స్ అలాగే ఉంది. తమిళనాడుకి చెందిన 35 ఏళ్ళ స్నేహ వృత్తిరిత్య లాయర్. ఈ సర్టిఫికెట్ గురించి ఆమె 9 నెలలుగా పోరాటం చేస్తున్నారు.చిన్నప్పటి నుంచి కులాలు మతాలు రాసే అవసరం ఉన్నా స్కూల్ సర్టిఫికెట్లలో ఆ కాలమ్స్ ఖాళీగా ఉంచితే దానికి కమ్యూనిటి నుంచి సర్టిఫికెట్ అడిగేవాళ్ళు. ఆ సమస్యకి పరిష్కారంగా ఈ సర్టిఫికెట్ కి అప్లై చేసింది స్నేహా.